Total Pageviews

Sunday, March 30, 2014

‘prayers' would be done on behalf of every person,

The 41days sai pooja, sai chanting, harati etc are going to be held from the auspicious day of 'sri rama navami'. As a part of this program, the ‘prayers' would be done on behalf of every person, so interested candidates could send their name and problems if any, mail to 'saieprayer@gmail.com'

Saturday, March 29, 2014

సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు.

షిర్డీ సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు. సాయి నాధుడు ఒకపక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరోపక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. షిర్డీ సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు. సద్గురు షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి. ప్రశాంతత చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం.

"SHIRDIHELPLINE"

WITH THE BLESSINGs OF SAINATH MAHARAJ, A HUMBLE OFFERING TO SAI DEVOTEES,

A 24X7 DEDICATED FREE INFORMATION AND CONSULTANCY SERVICE "SHIRDIHELPLINE"

Anantkoti Bramhandnayak Rajadhiraaj Yogiraaj Parambramha Sachidanand Satguru Shree Sainath Maharaj ki Jai!!!

Om SAI RAM

Wednesday, March 26, 2014

Sree Rama Navami Celebrations at Shirdi Saibaba Dhyana Mandiram, Kasibugga, Palasa, Srikakulam Dt

 
 
 
 
 
Sree Rama Navami Celebrations at Shirdi Saibaba Dhyana Mandiram, Kasibugga, Palasa, Srikakulam Dt & Dhwaja Sthambha & Guru Sthan Guru Paduka Punah Pratishta
by His Holiness Swaroopa Nandendra Swamiji, Sri Sarada Peetham, Vishakhapatnam. All are invited .

Sunday, March 23, 2014

బాబా తో అనుభూతులు -----అంజలి

 


నా పేరు  అంజలి విజయవాడ నేను హైదరాబాద్ లో ఉద్యొగం చేస్తున్నాను నాకు దేవుడి మిద నమ్మకం వుండేది కాదు దేవుడు లేదు అని అందరితో వాదించే దాన్ని నేను హైదరాబాద్ రాకముందు నాకు బాబా గురించి కొంచం తెలుసు
కానీ అంత నమ్మకం లేదు  నేను హైదరాబాద్ వచ్చాక ఉద్యొగం కోసం చాల ప్రయత్నం చేశాను కానీ నాకు ౧౫ రోజుల వరకు ఉద్యొగం రాలేదు .నన్నుమా ఇంట్లో అమ్మ నాన్న తిరిగి వచ్చేయమన్నారు నేను బాబా దగ్గర బాబా నువ్వు నిజంగా భక్తుల కోరికలు తీరిస్తే నాకు 2 రోజులలో ఉద్యొగం వస్తుంది లేకుంటే రాదు అని కోరుకున్నాను నాకు 2 రోజులలో ఉద్యొగం వచ్చింది అప్పటినుంచి నేను బాబాను నమ్మడం కన్నా బాబాను ప్రేమించడం మొదలు పెట్టాను
నా రూమ్ లో ఎటు చుసిన బాబా ఫొటోస్ ఉంటాయి నేను ప్రతి రోజు బాబా గుడి కి ఉదయం & రాత్రి ఆరతికి  హాజరయ్యేదాన్ని
4 సం నుండి వెళ్తున్నాను నేను వెళ్ళే వరకు ఆరతి మొదలు కాదు కోసం బాబా ఎదురు చూస్తుంటారు నేను చాల బాధలు అనుభవించాను మా నాన్న గారు మద్యనే చని పోయారు (18/11/12) మా నాన్న గారు అంటే నాకు చాల ఇష్టం అప్పుడు నేను బాబా ను కొట్టాను చాల ఏడ్చాను బాబా ఎందుకు ఇలా చేసావు అని చాల బాధ పడ్డాను మా చుట్టాలు అందరు నువ్వు బాబా బాబా అని గుడికి వెళ్తావు ని బాబా ఏమి చేసాడు అని అన్నారు ?
నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చే ద్దామ అని ఏడ్చేదాన్ని బాబా ని చూసి 15 రోజులు అయింది నేను గుడి కి వెళ్ళకూడదు మా నాన్నగారి తిది అయ్యేవరకు బాబా నిన్ను చూసి చాల రోజులు అయింది బాబా నాకు ఎవరు లేరు నువ్వు కూడా నాకు లెవా వుంటే కలలో కనిపించు అని అడిగాను నాకు తెలుసు బాబా కనిపించరు అని ఎందుకంటె ఇంతకముందు కలలో కనిపించి కొన్ని విషయాలు చెప్పారు
అవి ఏమిటి అంటే మా ర్చి 2012 తెల్లవారుజామున ఉదయం 4 గం కు నాకు కలలో కనిపించి నేను ప్రతి రోజు గుడికి వెళ్తాను కదా అలాగే కలలో కూడా ఉదయం ఆరతి 6.15 కి  వెళ్ళాను వెళ్ళేటప్పటికి బాబా విగ్రహం సగం విరిగి వుంది నేను అది చూసి చాల బాధ పడ్డాను బాబా ఏంటి నీకు ఈ పరిస్థితీ ఎందుకు ఇలా జరిగింది అని ఏడ్చాను నేను అక్కడ విభూది పెట్టుకుందాం అని వెళ్ళాను బాబా అక్కడ కుర్చుని తల మోకాళ్లమిద పెట్టుకొని వున్నారు ఏంటి బాబా మీరు ఇక్కడ వున్నారు అని బాబా మిద చేతిని వేసాను బాబానా  వైపు చూసారు బాబా ఏడుస్తున్నారు బాబా ఏంటి మీరు ఎందుకు బాధ పడుతున్నారు అని అన్నాను దానికి బాబా ఇక్కడ స్వార్ధం పెరిగి పాయింది స్వార్ధం వున్నచోట నేను ఉండను అని చెప్పారు దానికి మీరు ఏమి చేయగలరు బాబా అన్నాను నువ్వు ఏమి చేయలేవా  నువ్వు ఏమి చేయలేవా  అని గట్టిగ అరిచారు నాకు చాల భయం వేసింది
బాబా నన్ను క్షమించండి బాబా మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మాములుగా కనిపించండి నేను సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను నేను రాత్రి హరతికి వెళ్ళాను వేరే విగ్ర హం పెట్టారు అది కూడా బాబా పిచ్చిగా నవ్వుతున్న విగ్రహం పెట్టారు ఏంటి బాబా మీకు ఈ పరిస్థితి అని అనుకున్న బాబా నేను అంటే మీకు ఇష్టం వుంటే ఉదయం వచ్చేసరికి ఎప్పుడు వుండే విగ్రహం వుండాలి అని అనుకోని వెళ్ళిపోయాను ఉదయం హరతికి వచ్చాను  అప్పుడు ఎప్పుడు వుండే విగ్రహం వుంది హమ్మయ్య నా బాబా నాకు వచ్చేసారు అని చాల సంతొషం గా అనిపించింది హారతి అయిపోయిందిబాబా వస్త్రం తీసీ అభిషీకం చేస్తున్నారు అప్పుడు చూసాను విగ్రహాన్ని అతికించి పెట్టారు నేను దర్శనంచేసుకోవడానికి బాబా ఎదుటకు వెళ్ళాను అప్పుడు బాబా నా వైపు చూసి నీకు చెప్తేఅర్ధం కాదా ఇక్కడ స్వార్ధం పెరిగింది స్వార్ధం వున్నా చోటు నేను ఉండను అని చెప్పానా  అని గట్టిగా అరిచారు బాబా కనుల వెంట రక్తం కారింది నాకు చాల భయం వేసింది నాకు మేలకువ వచ్చింది
నేను ఉలికి  పది లేచి టైం చూసాను 5  గం లు అయింది నాకు ఏంటి పిచ్చి కల వచ్చింది అని భయపడ్డాను అమ్మో బాబా కి ఏమైండో  ఉదయం గుడికి తొందరగా వెళ్ళాలి అని మరల  భయపడ్డాను గుడికి రోజు వచ్చే అమ్మాయికాల్ చేసింది
( నేను సాయి బాబా గుడి స్నేహితులందరికీఒక రింగ్ టోన్ పెట్టాను రింగ్ టోన్ బాబా నువ్వు మావలె మనిషివి నీకు మరణం వుంది అనే సాంగ్ పెట్టాను )నేను ఉలికి పడి లేచాను అమ్మో టెంపుల్ నుండి కాల్ వచ్చింది ఏమైంది అని పోనే లిఫ్ట్ చేసి బాబా ఎలా వున్నారు అని అడిగాను అప్పుడు ఆమె ఏమైంది అక్క మీకు ఎందుకు బాధ పడుతున్నారు  నాకు అర్ధం కావడం లేదు బాబా కి ఏమి కాదు అనింది నేను అప్పుడు కల గురుంచి ఆమె కి చెప్పా ను నువ్వు త్వరగా గుడి కి వెళ్లి చూడు నేను వస్తాను అని అన్నాను
వేరే ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్పను గుడి కి వెళ్ళాలంటే
భయం వేస్తుంది అన్నాను ఏమి కాదు నువ్వు రా అని మా ఫ్రెండ్ చెప్పింది నేను గుడి మెట్లు ఎక్కుతూ బాబా నాకు వచ్చిన కల నిజం అయితే
రోజు నువ్వు తెల్ల డ్రెస్ లో కనిపిస్తావు లేకుంటే అది పిచ్చి కల అని కొట్టి వేస్తాను అని అనుకోని వెళ్ళాను చూసేటప్పటికి బాబా పింక్ కలర్ లో కనిపించా  రు అందరికి కల గూర్చి చెప్పిన ఏమి కాదులే అన్నారు ఇంకా కల గూర్చి వదిలేసాను


రాత్రి హారతి 8 గంటలు మొదలుఅవుతుంది నాకు ఆ రోజు ఆఫీస్ లో లేట్ అయింది  5 నిమిషములు  ఆటే గా హారతి కి వెళ్ళాను
అప్పుడే బాబా కి వస్త్రం మర్చి వుంది తెల్ల వస్త్రం లో బాబా కనిపించా రు నాకు చాల భయం వేసింది  అప్పుడు పుజారిని అడిగాను బాబా కు ఎందుకు వస్త్రం మార్చారు ఒక్కటే వస్త్రం ఉంచుతారు కదా అప్పుడు పూజారి గారు లేదమ్మా ఎవరిదో పుట్టిన రోజు అంట ఇది కట్టమన్నారు నేను రేపు కడతాను అని చెప్పినా వినలేదు ఇప్పుడే కట్టండి దయ చేసి అని బ్రతిమాలారు అందుకని వస్త్రం మార్చాను అని అన్నారు అప్పుడు నేను బాబా ని మీరు నేను ఎంత అడిగినా  కల లోకి రావద్దునేను  అని బాధ పడినా  కల లోకి రావద్దు అని గట్టిగా చెప్పా ను
అందుకే మా తండ్రి చనిపౌయి నపుడు ఎంత అడిగినా నాకు బాబా కలలో కనిపించ లేదు ఆలాగే బాబా మన కోరికలు ఎలా నేరవేరుస్తారో మనము కుడా అలాగే బాబా కోరిక నెరవేర్చాలి అనుకున్న బాబా ఇక్కడ స్వార్ధం పెరిగింది అన్నారు కదా దానికి నేను ఇక్కడ స్వార్ధం తెసేస్తాను దానికి మీరు నాకు సహయం చేస్తారు కదా అని అడిగాను గుడి లో వున్నవారందరికీ బాబా నాకు ఇచ్చిన కల గూర్చి చెప్పా ను కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు విననివారికి బాబానే  తెలిపా రు ఇప్పుడు బాబా సేవ అందరు మంచిగా చేసుకుంటున్నారు స్వార్ధం చూపించడం లేదు నేను బాబా కోరికను కొంచమయిన నేరవేర్చాను అని అనుకుంటున్నరు బాబా ఆశిస్సులతోనేను బాబా భక్తులకు చేపీది ఏమిటంటే స్వార్ధం వున్నా చోటు బాబా వుండరు స్వార్ధాన్ని పారద్రోలాలి అన్రారిని చిరునవ్వుతో మార్చాలి అనేది నా ఉద్దేశం మీరు కుడా మారుతారు కదా

నా తెలుగు అనువాదం లో తప్పులు వుంటే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి
సుకన్య


 

Thursday, March 20, 2014

మనోనిగ్రహము గురించి బాబా నానాకు బోధించుట:


ఒకనాడు బీజాపూరు నుంచి ఒక మహమ్మదీయ కుటుంబము బాబా దర్శనార్ధమై వచ్చెను. వారిలో ఇద్దరు ఘోషా స్త్రీలు కలరు. వారు మసీడులోనికి వచ్చి బాబా ఎదురుగా మోములపై గల ముసుగు తొలగించి నమస్కరించిరి. వారిలో ఒకామె చక్కదనాల చుక్కవలె అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు ప్రక్కనే కూర్చున్న నానా యొక్క మనస్సు చలించెను. ఆమెను ఇంకోక్కసారి చూడాలనిపించెను. అది గమనించిన బాబా నానా తొడపై చేతితో కొట్టెను. వారు వేల్లిపోయిన తరువాత బాబా నానాతో “నిన్నేలకొట్టితిని” అని ప్రశ్నిస్తాడు. నామనోవికారమును గుర్తించి మీరు నన్ను కొట్టారని నానా జవాబిస్తాడు. అవును నీవు చూచిన యువతి మిక్కిలి సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంతా అందంగా ఉంటె, ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఆలోచించావా!
మనం ఆలోచించవలసినది అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతనుగాని ఇందులో గల వస్తువులను కాదు. గుడికి పోవునది దేవుని కొరకుగాని గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములతో ఐక్యమైనప్పుడే అది చలిస్తుంది. ఈ శరీరం ఒక రథంలాంటిది. బుద్ధి రథసారధి. ఇంద్రియాలు గుర్రాలు. గుర్రముల పగాలను రథసారధి గట్టిగా పట్టుకున్నచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలడు. అట్లు గాక సారధికి గుర్రములపై అదుపు తప్పినచో వాటి ఇష్టము వచ్చినట్లుగా ప్రయాణించును. గమ్యస్థానము చేరలేము. బుద్దితో ఇంద్రియాలను అదుపు చేయగలవారు మాత్రమె ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు.
ఓం నమో పరమాత్మయే నమః

Wednesday, March 19, 2014

సాయిబాబా దర్శనం

సాయిబాబాను చూడాలనే ఆశతో ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చేవారు. అయితే తమ ఇష్టం వచ్చినట్లు చుట్టుముట్టేవారు కాదు. ఎవరైనా సరే తమ వంతు వచ్చేవరకు ఆగేవారు. బాబాకు కనుక ఇష్టం లేకుంటే ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేసేవారు కాదు. ఒకవేళ వెళ్లాలనుకున్నా బాబా దర్శనభాగ్యం కలిగేది కాదు. కనీసం ఆయన నామాన్ని కూడా స్మరించలేక పోయేవారు.
సాయిబాబా మహా సమాధి చెందకముందు ఆయనను తృప్తిగా దర్శించుకోవాలని వెళ్ళిన ఎందరో భక్తులకు నిరాశే ఎదురైంది. తమ కోరిక తీరలేదని నిరాశగా చెప్పిన భక్తులున్నారు. అదృష్టవంతులకు మాత్రమే బాబా దర్శనభాగ్యం కలిగింది.
తనను చూడాలని వచ్చిన కొందరు భక్తులను సాయిబాబా కొన్నాళ్ళు అక్కడే ఉండమనేవారు. ఎవరైనా భక్తులు బాబా వద్దు అంటున్నా వినకుండా బయలుదేరితే, మళ్ళీ వెనక్కి రావలసి వచ్చేది. అలాంటి అనుభవాలు ఎదురయ్యాక ఆయన సమ్మతిస్తేనే వెనక్కు వెళ్ళేవారు. ఇంకొందరిని పూర్తిగా షిరిడీలోనే స్థిరపడమని చెప్పేవారు. మరికొందరు అక్కడికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేక పోయేవారు.
ఇప్పుడు సాయిబాబా మహా సమాధి చెందిన తర్వాత కూడా ఆయన అనుమతి ఉంటేనే షిరిడీ వెళ్ళగలరు. బాబా ఆజ్ఞ ఉంటేనే షిరిడీలో అడుగు పెట్టగలుగుతారు. సాయిబాబాను దర్శించుకోవాలంటే ముందుగా ఆయన దయ మనమీద ప్రసరించాలి అన్నమాట

Tuesday, March 18, 2014

Laxmibai Home in Shirdi.


Wednesday, March 12, 2014

ప్రార్ధన..

ప్రేమతో ,భక్తితో పిలిస్తే పలకని ,తలిస్తే తరింపచేయని దైవం ఉంటారా ?
భక్తుల ప్రార్ధనలోని వేడుకోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా ?
ద్రౌపదిని వస్త్రాభరణం నుంచికాపాడింది ప్రార్ధనే!
గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే !
మార్కండేయుడిని యమగండం నుంచి తప్పంచింది ప్రార్థనే !
ప్రహ్లాదుడిని భక్తిముక్తిదాయకుడిని చేసింది ప్రార్దనే!

శ్యామను పాముకాటు నుంచి రక్షించి౦ది ,తాత్యాకు ప్రాణభిక్ష పెట్టింది ప్రార్దనే !
ఈ కాలంలో ప్రార్ధనకు అర్ధం మారిపోయింది.దేవుడితో బేరసారాలు ఆడటమే ప్రార్ధనల పరమావధి అయింది .'నా కోరిక తీర్చు...నీ చెంతకోస్తా'.....'ఫలానా పనయ్యేలా చేయ్యి... ''నీకు కనుకలిస్తా ''ఇంకా ఇలాంటివే మన ప్రార్ధనలన్ని !
ఏదిఏమైనా భగవంతుడు అందరివాడు .అందరిలోనూ ఉన్నాడు .
ప్రార్ధన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు.అందుకే మనం చేసే ప్రతి ప్రార్ధనకు ప్రతిఫలం ఉంటుంది .
కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం,ఐశ్వర్య౦,ఆరోగ్యం .....ఏదడిగిన కాదనకుండా భగవంతుడు మనకు కోరినవన్నీ ప్రసాదిస్తాడు .మనం కొరకునేవన్ని కూడా అవే !
మనం చేసే ప్రార్ధనలో 'దేవుడిలా కావాలని ' చేసే ప్రార్ధన ఓకటి ఉండదు .జ్ఞానాన్ని ప్రసాదించమని 'ఒక్కరూ భగవంతుడ్ని వేడుకోరు .
ఒకసారి కుంతిదేవితో శ్రీకృష్ణుడు ''అత్తా !ఏదైనా వరం కోరుకో ''అన్నాడట .
''నాపై దయ ఉంటే నాకు ఎడతెగని కష్టాలు ప్రసాదించు ''అందట కుంతిదేవీ .
''అదేమిటి ?అందరు భోగభాగ్యాలు ,సుఖసంతోషాలు కోరుకుంటే నువ్వేమో కోరికష్టాలను ఇవ్వమంటావు?''అని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు .
''కష్టాలలో ఉంటేనే కదా నిరతరం భగవంతుడు గుర్తుండేది .సుఖాలకు మరిగితే ఇక నీ అవసరం ఉండదు .నాకు భగవంతుని సాంగత్యమే ఇష్టం .అందుకే నేను భగవంతుడినే ఎల్లప్పుడూ ధ్యానించాల౦టే నాకు కష్టాలనే ఇవ్వు ''. భగవంతుడు చెంతనే ఉంటే మాత్రం కోరి కష్టాలను వరించటం ,మనసును కష్ట పెట్టుకోవటం ఎవరికీ మాత్రం ఇష్టం .మరి ,మన కోరికలను తీర్చుకుంటునే భగవంతుడుని ఎలా ధ్యానించాలి ?నిత్యం భగవంతుడిని మనసు మందిరంలో ఎలా ప్రతిష్టించుకోవాలి ?అసలు మనం భగవంతుడిని కోరుకోవాల్సినవి ఏమిటి ?ఇవన్ని భక్తుడిని సందిగ్ధలో పడవేసే ప్రశ్నలు .చాలా వరకు సులభరీతిలో సమాధానం దొరకనివి కూడా!
ఈ క్రమంలోనే మానవజన్మకు భూమిపైనే చరితార్థం చేయగల సులభోపాయాలు ,సరళబోధలు ,నీతిసూత్రాలు ,చక్కని ఉపదేశాలతో జ్ఞానమార్గాన్ని చూపటానికి ఓ దివ్యవతరం వెలసింది .మానవాళి ఉద్ధరణకు మానవ రూపంలో అవతరించిన ఆ దైవమే షిరిడిసాయినాధుడు .అరవై ఏళ్ళ పాటు ఈ నేలపై నడయాడి మనుషుల పాప కర్మలని ,కష్టాల్ని తనపై వేసుకుని ,తననుభవించి మానవ జీవితాలను పావనం చేసిన సాయినాధుడు భక్తసులభుడు. మనిషి నడవడిక ఎలా ఉండాలో బాబా స్వయంగా ఆచరించి చూపారు.ఆదర్సజీవన విధానానికి బాటలు వేశారు .ఆ అడుగుజాడలే ఇవి....ఆసాయిపధ౦ఇది .......ఆ బాటలో నడవండి !ముక్తులుకండి!జీవితాల్ని ధన్యంచేసుకోండి.ఇక సర్వం శ్రేయస్సులు మీవే!